వరాల తల్లి వనదేవత సమ్మక్క చిలుకల గుట్ట నుంచి మేడారానికి బయల్దేరింది. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వస్తున్నారు. జిల్లా ఎస్పీ ఏకే 47 తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. జనవరి 29న రాత్రి 9 గంటల వరకు సమ్మక్క గద్దెపైకి చేరనుంది.
తల్లి రాకకోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. తల్లుల రాక సందర్భంగా ఎదురుకోళ్లు ఇచ్చేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు. ఉదయం కంకవనం తెచ్చి గద్దెపై పెట్టిన పూజారులు చిలుకల గుట్టకు వెళ్లి రహస్య ప్రాంతంలో కుంకుమ భరిణెరూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని బయల్దేరారు. ఈ సమయంలో దేవత పూజారిని ఆవహిస్తుంది. సమ్మక్క వచ్చే సమయంలో భక్తులు తాకేందుకు యత్నిస్తారు. దీనిని నివారించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
