మార్కెట్‌‌లోకి కొత్త ఫిట్‌‌నెస్‌‌ సెన్సర్‌‌‌‌

మార్కెట్‌‌లోకి  కొత్త ఫిట్‌‌నెస్‌‌ సెన్సర్‌‌‌‌

మార్కెట్‌‌లోకి కొత్తగా ఫిట్‌‌నెస్‌‌ సెన్సర్‌‌‌‌ వచ్చింది. ఇది మామూలు సెన్సర్‌‌‌‌లా కాదు. ఈ సెన్సర్‌‌‌‌ చెమట చూసి శరీరంలో ఏమేం హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఉన్నాయో చెప్పేస్తది.
ఫిట్‌‌నెస్‌‌ బ్యాండ్స్‌‌, వాచీలను బయట చూస్తుంటాం. అవి మణికట్టు దగ్గర వాటికున్న సెన్సర్‌‌‌‌తో పల్స్‌‌ రేట్, హార్ట్‌‌బీట్‌‌ను చూపిస్తాయి. రోజులో ఎన్ని అడుగులు నడిచారో చెప్తాయి. స్లీప్‌‌ ట్రాకింగ్‌‌ చేస్తాయి. క్యాలరీలు ఎన్ని కరిగాయో చూపిస్తాయి. కాకపోతే ఈ ఎంఎక్సినస్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సెన్సర్‌‌‌‌ హెల్త్‌‌ను కూడా మానిటర్‌‌‌‌ చేస్తుంది. దీన్ని ఈ మధ్యే సౌదీ అరేబియాకు చెందిన కంపెనీ తయారుచేసింది.
  ఎంఎక్సినస్‌‌ అనేది గ్రాఫిన్‌‌లాగ టు–డైమెన్షనల్‌‌ ట్రాన్సిషన్‌‌ మెటీరియల్. ఎంఎక్సినస్‌‌ మెటీరియల్‌‌లో కార్బన్‌‌, నైట్రోజన్‌‌, టైటానియంలు కలిసి ఉన్నాయి. అలాగని ఇది విషపూరితమైన మెటీరియల్‌‌ మాత్రం కాదు. ఈ సెన్సర్‌‌‌‌లు శరీరంలో కలిగే రసాయన మార్పులను గుర్తిస్తాయి. ఇదెలా పని చేస్తుందంటే... చెమటలో ఉండే  పిహెచ్‌‌లో గ్లూకోజ్‌‌, లాక్టిక్‌‌ యాసిడ్‌‌ ఉంటాయి. వీటితో ఆ సెన్సర్ రియాక్ట్‌‌ అయ్యి... హెల్త్‌‌ను అనలైజ్‌‌ చేసి చూపిస్తుంది. కాకపోతే ఇది ఇంకా స్పోర్ట్స్‌‌ ఆడేవాళ్ల కోసమే అందుబాటులో ఉంది. 
  ‘ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేస్తున్నపుడు లేదా అలసిపోతున్న పుడు కలిగే ఒత్తిడితో‌‌ వచ్చే చెమటలోని పిహెచ్‌‌తో కలిసి శరీరంలో జరిగే మార్పులను ఈ సెన్సర్‌‌‌‌ గుర్తిస్తుంది’. బ్లూటూత్‌‌తో దగ్గరలో ఉన్న డివైజ్‌‌లకు కనెక్ట్‌‌ చేసుకొని దీన్ని వాడొచ్చు. ఎంఎక్సినస్‌‌ సెన్సర్‌‌‌‌ను మరింత డెవలప్‌‌ చేసి ఫ్యూచర్‌‌‌‌లో ఇంకా కొత్త డిజైన్‌‌లలో అందు
బాటులోకి తెస్తామ’ని  చెప్పారు కంపెనీ వాళ్లు.