ప్రధాని మోడీ పిలుపు తర్వాత వారం ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను గమనించాలి.
మే 15న బంగారం రేట్లు తగ్గాయి. మే 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.224 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 009గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 675గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 15, 2026న కేజీకి రూ.10వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు తగ్గి రూ.3లక్షల 05వేలకు చేరుకుంది. అంటే గ్రాము దాదాపుగా రూ.305 దగ్గర కొనసాగుతుందన్నమాట.
