ఇప్పుడు కిలో వెండి 2 లక్షల 90 వేలు.. ఇంకా పెరుగుతుందా.. తగ్గుతుందా.. జనంలో డైలమా..!

ఇప్పుడు కిలో వెండి 2 లక్షల 90 వేలు.. ఇంకా పెరుగుతుందా.. తగ్గుతుందా.. జనంలో డైలమా..!

ఒకపక్క అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ భయాలకు చిన్న బ్రేక్ రాగా.. మరోపక్క అమెరికా కోర్టు ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధమైనవిగా పేర్కొన్న వేళ మెటల్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా మారినప్పటికీ బంగారం, వెండి రేట్లు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో అసలు వెండి రేట్లు గతంలో మాదిరిగా ఇంకా పెరుగుతాయా లేక తగ్గి కేజీ రూ.2లక్షల 50వేల కంటే దిగువకు చేరుకుంటాయా అనే డైలమా చాలా మందిలో కొనసాగుతోంది. 

ఫిబ్రవరి 21న బంగారం రేట్లు స్వల్ప పెరగటం కొనుగోలుదారులకు షాక్ అని చెప్పుకోవాలి. దీంతో ఫిబ్రవరి 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.191 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 928గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 600గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో వెండి క్రమంగా పుంజుకుంటోంది. అయితే శనివారం ఫిబ్రవరి 21, 2025న వెండి రేటు తెలుగు రాష్ట్రాల్లో కేజీకి రూ.20వేలు పెరిగింది నిన్నటి కంటే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ హీట్ చల్లారే వరకూ మెటల్స్ మళ్లీ స్థిమితపడవని నిపుణులు అంచనా వేస్తున్నారు.