Gold Rate: కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Rate: కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

Gold Price Today: నేడు సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. వచ్చే నెల దసరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెలలోనే తమకు నచ్చిన గోల్డ్, సిల్వర్ జ్యూవెలరీ, వస్తువులను కొనుక్కోవాలని చాలా మంది తెలుగు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ రాజకీయ సంక్లిష్టతలు అనిశ్చితులను పెంచటంతో ప్రస్తుతం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా సేఫ్ హెవెన్ మెటల్స్ దిశగా తమ పెట్టుబడి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు తగ్గుతాయా లేక మరింతగా పెరుగుతాయా అనే ఆందోళనలు చాలా మందిని వెంటాడుతున్నాయి. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 1న 10 గ్రాములకు రూ.930 పెరిగింది ఆగస్టు 31తో పోల్చితే. అంటే గ్రాముకు రేటు రూ.93 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో నేటి పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

ALSO READ : ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌కు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ బూస్ట్‌‌‌‌‌‌‌‌!

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 1న):

  • హైదరాదాబాదులో రూ.10వేల 588
  • కరీంనగర్ లో రూ.10వేల 588
  • ఖమ్మంలో రూ.10వేల 588
  • నిజామాబాద్ లో రూ.10వేల 588
  • విజయవాడలో రూ.10వేల 588
  • కడపలో రూ.10వేల 588
  • విశాఖలో రూ.10వేల 588
  • నెల్లూరు రూ.10వేల 588
  • తిరుపతిలో రూ.10వేల 588

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు కొత్త నెల సెప్టెంబర్ మెుదటి రోజున ఆగస్టు 31తో పోల్చితే 10 గ్రాములకు రూ.850 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 1న):

  • హైదరాదాబాదులో రూ.9వేల 705
  • కరీంనగర్ లో రూ.9వేల 705
  • ఖమ్మంలో రూ.9వేల 705
  • నిజామాబాద్ లో రూ.9వేల 705
  • విజయవాడలో రూ.9వేల 705
  • కడపలో రూ.9వేల 705
  • విశాఖలో రూ.9వేల 705
  • నెల్లూరు రూ.9వేల 705
  • తిరుపతిలో రూ.9వేల 705

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 1న కేజీకి వెండి ఆగస్టు 31తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 36వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.136 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.