ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌కు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ బూస్ట్‌‌‌‌‌‌‌‌!

ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌కు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ బూస్ట్‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ సమావేశం (సెప్టెంబర్ 3–4) , మాక్రో  ఎకనామిక్ డేటా, విదేశీ పెట్టుబడుల కదలికలు నిర్ణయించనున్నాయి.  అమెరికా విధించిన 50శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ప్రభావంతో గత వారం బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1.84శాతం, నిఫ్టీ  1.78శాతం పతనమయ్యాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా జీడీపీ  7.8శాతం వృద్ధి సాధించింది. 

దీంతో సోమవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌లు లాభపడొచ్చు.  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్ల తగ్గింపు,  ఆటో అమ్మకాలు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ పీఎంఐ  డేటా, రూపాయి, -డాలర్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌, క్రూడ్ ఆయిల్ ధరలపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. మరోవైపు  అమెరికా నాన్-ఫార్మ్ పేరోల్స్ వంటి గ్లోబల్ డేటా కూడా మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను   ప్రభావితం చేయొచ్చని చెబుతున్నారు.  ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐల)  అమ్మకాలు కొనసాగుతుండగా, డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) మార్కెట్‌‌‌‌‌‌‌‌గా సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. టారిఫ్ చర్చలపై ఒక క్లారిటీ వచ్చాక  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో గందరగోళం తగ్గుతుందని అంచనా.