రూ.3కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం

రూ.3కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం

గత రెండు రోజుల వ్యవధిలో చెన్నై ఎయిర్ పోర్టులో జరిగిన పలు ఘటనల్లో ₹ 3.09 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం ఆగస్ట్ 3,4 తేదీల్లో దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల ప్యాంట్ పాకెట్‌లలో పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని , రెండు బంగారు గొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. 

మరో సంఘటనలో, అంతర్జాతీయ విమానాశ్రయంలోని అరైవల్ హాల్ వద్ద పేస్ట్ రూపంలో ఉన్న ఆరు ప్యాకెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ₹ 3.09 కోట్ల విలువైన 6.50 కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యక్తుల నుంచి జప్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.