వెయిట్​ లిఫ్టింగ్​లో గోల్డ్​మెడల్

వెయిట్​ లిఫ్టింగ్​లో గోల్డ్​మెడల్

నవాబుపేట, వెలుగు: మండలంలోని కారుకొండ గ్రామానికి చెందిన మల్లేపల్లి ఆనంద్​కుమార్​ నేషనల్​ వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్​లో గోల్డ్​మెడల్​ సాధించాడు. 
హైదరాబాద్​లోని చిక్కడపల్లిలో తెలంగాణ మాస్టర్స్​ వెయిట్​ లిఫ్టింగ్​ అసోషియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 61 కిలోల విభాగంలో 130 కిలోల బరువు ఎత్తాడు.

ఆనంద్​ను మండల నాయకులు, సన్నిహితులు అభినందించారు.