కొల్లాపూర్లో ఉచితంగా 100 రోజుల పాటు పోలీస్ కోచింగ్

కొల్లాపూర్లో ఉచితంగా 100 రోజుల పాటు పోలీస్ కోచింగ్

కొల్లాపూర్, వెలుగు: రాష్ట్రంలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు పట్టణంలోని మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 100 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. బుధవారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్​ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉచిత పోలీస్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శిక్షణకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఫౌండేషన్ కన్వీనర్ కేతుధర్మతేజ తెలిపారు.