కాస్ట్లీ ఏరియాలో రెస్టారెంట్ల కల్తీ కహానీ.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో పరిస్థితి ఇంత దారుణమా!

కాస్ట్లీ ఏరియాలో రెస్టారెంట్ల కల్తీ కహానీ.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో పరిస్థితి ఇంత దారుణమా!

హైదరాబాద్ సిటీలోని కాస్ట్ లీ ఏరియాల్లో రెస్టారెంట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాం. అక్కడ రిచ్ పీపుల్ ఉండే ఏరియా.. హోటల్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి.. అని అనుకుంటాం కదా. కానీ రెస్టారెంట్ల తీరు ఎక్కడైనా ఒకటే. ఏరియాను బట్టి రేట్లు పెంచవచ్చు కానీ.. క్వాలిటీ విషయంలో సేమ్ అదే తీరు. 2026 ఆగస్టు 29న  హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై TG SAFE నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

TG SAFE అధికారులు 6 ప్రత్యేక బృందాలతో 7 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లో చట్నీస్, స్పైస్ 6, ఓహ్రీస్ రెస్టారెంట్లు.. జూబ్లీహిల్స్‌లో ది స్పైసీ వెన్యూ.. టోలిచౌకిలో 4 సీజన్స్ మల్టీకుయిజిన్, షా గౌస్.. గచ్చిబౌలిలో పిస్తా హౌస్ రెస్టారెంట్ మొదలైన చోట్ల తనిఖీలు చేపట్టారు. 

రైడ్స్ లో అధికారులు షాకింగ్ విషయాలు కనుగొన్నారు.  కొన్ని రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.  ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనల ఉల్లంఘించినట్లు తేల్చారు.

కుళ్లిపోయిన కూరగాయలు, పురుగుల సమస్య ఉన్నట్లు చెప్పారు. FSSAI లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనల ఉల్లంఘించడంపై రెస్టారెండ్ల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద కల్తీపై 11 ఆహార నమూనాలు సేకరించారు.  4 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, 3 షోకాజ్ నోటీసులు జారీ చేశారు.