
దేశంలో బంగారం , వెండి ధరలు తగ్గాయి. సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 60, 050 ఉండగా..సెప్టెంబర్ 26వ తేదీ మంగళవారం 10 గ్రాముల బంగారంపై రూ. 150 తగ్గి రూ. 59,900కు చేరుకుంది.
అటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి సెప్టెంబర్ 25వ తేదీన రూ. 75,350 ఉండగా..సెప్టెంబర్ 26వ తేదీ మంగళవారం కిలో వెండిపై రూ. 850 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి రూ. 74,500కు చేరింది.
Also Read :- విప్రో ఆస్తుల అమ్మకం.. రూ.266 కోట్ల డీల్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 26వ తేదీన ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1912 డాలర్ల వద్దనే ట్రేడయింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.05 డాలర్లుగా ఉంది.