
యెచియాన్: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–2లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో మెరిసింది. ఆదివారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్ ఫైట్‌లో జ్యోతి–పర్నీత్ కౌర్–అదితి స్వామితో కూడిన వరల్డ్ నంబర్‌వన్ ఇండియా 232–226తో టర్కీ టీమ్‌ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఇండియా త్రయం ఒక్క సెట్ కూడా కోల్పోలేదు.
తాజా విక్టరీతో జ్యోతి–పర్నీత్–అదితి.. వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్‌ను పూర్తి చేశారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో జ్యోతి–ప్రియాన్ష్ సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో అమెరికన్స్ ఒలీవియా డీన్–సావెర్ సులివాన్ 155–153తో జ్యోతి ద్వయంపై నెగ్గి గోల్డ్‌ను సొంతం చేసుకున్నారు. మెన్స్ కాంపౌండ్ కేటగిరీలో యంగ్ ఆర్చర్ ప్రథమేశ్ మెడల్ నెగ్గలేకపోయాడు. బ్రాంజ్ మెడల్ షూటాఫ్‌లో వరల్డ్ నంబర్‌వన్ మైక్ స్కోలెసర్ (నెదర్లాండ్స్).. ప్రథమేశ్‌ను ఓడించాడు.