V6 News

గాఢనిద్రలో ఉండగా వచ్చి బీరువాలోని నగలను కొట్టేసిన్రు

గాఢనిద్రలో ఉండగా వచ్చి బీరువాలోని నగలను కొట్టేసిన్రు
  • యాలాలలో దొంగల బీభత్సం 

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీకి చెందిన పోతురాజు వెంకటయ్య తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపుల గడియను చాకచక్యంగా తెరిచి లోపలికి ప్రవేశించారు. 

అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న రెండు తులాల బంగారు నెక్లెస్, ఒక జత కమ్మలతో పాటు రెండు తులాల వెండి కడెంను దొంగిలించారు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండటం, నగలు మాయమవడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.