
మలక్ పేట, వెలుగు: మలక్‌పేట చాదర్ ఘాట్ పీఎస్పరిధిలోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. 67.65 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అజంపురా మలక్‌పేట రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఉండే మొహమ్మద్ ఫహీముద్దీన్(56) ప్రైవేట్ఉద్యోగి. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
ఫహీముద్దీన్ తమ్ముడు ఖాజా మొయినుద్దీన్ భార్య మరియం ఫాతిమా రెండు రోజుల కింద ఇంట్లో పడిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్‌చేశారు. ఆమెను చూసుకోవడానికి ఫహీముద్దీన్భార్య వెళ్లింది. శుక్రవారం రాత్రి11 గంటలకు తన కూతురు, కొడుకు, తమ్ముడుతో కలిసి ఫహీముద్దీన్భోజనం చేశాడు. తర్వాత వేర్వురు గదుల్లో అంతా నిద్రపోయారు.
అయితే అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తి ఫహీముద్దీన్ఇంట్లోకి చొరబడ్డారు. కిచెన్ విండో ద్వారా ఇంట్లోకి దూకారు. అక్కడి హ్యాండిల్‌కు తగిలించిన తాళాలతో అల్మారాను తెరిచి 67.65 తులాల బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. శనివారం ఉదయం 4 గంటలకు నిద్రలేచిన ఫహీముద్దీన్ అల్మారా తెరిచి ఉన్నట్లు గుర్తించాడు.
బంగారం, డబ్బు కనిపించకపోవడంతో దొంగలు పడ్డారని తెలుసుకుని చాదర్ఘాట్పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అల్మారాలో పెట్టిన 6 7.65 తులాల గోల్డ్, మొబైల్ ఫోన్, వాచ్, వీడియో కెమెరా, కొంత నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. మలక్ పేట ఏసీపీ శ్యాంసుందర్, చాదర్ ఘాట్ ఇన్స్పెక్టర్బ్రహ్మ మురారి, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భూపాల్ గౌడ్, ఎస్సైలు తిరుపతి, భరత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్సాయంతో తనిఖీలు నిర్వహించారు. ఐదు టీమ్స్ ను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.