లగ్జరీ కార్లు ఇష్టపడే వారికి పండగే.. ఇండియాలోకి కొత్త మెర్సిడెస్ V-క్లాస్ రీ-ఎంట్రీ.. ప్రత్యేకతలు ఇవే !

 లగ్జరీ కార్లు ఇష్టపడే వారికి పండగే.. ఇండియాలోకి  కొత్త మెర్సిడెస్ V-క్లాస్ రీ-ఎంట్రీ.. ప్రత్యేకతలు ఇవే !

లగ్జరీ కార్స్ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా మళ్ళీ లగ్జరీ కార్ల మార్కెట్లోకి  పాపులర్ మోడల్ V-క్లాస్ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ కారు మళ్ళి మార్కెట్లోకి వస్తుంది. మెర్సిడెస్ సంస్థ ఈ కారును కేవలం ఒక వాహనంల కాకుండా ప్రైవేట్ సూట్ ఆన్ వీల్స్ అని పిలుస్తుంది. 

ముంబైలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 కోట్లు. రిజిస్ట్రేషన్ ఫీజులు, టాక్సులు, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఆన్-రోడ్ ధర కలుపుకొని  సుమారు రూ. 1.65 కోట్ల నుండి రూ. 1.68 కోట్ల వరకు ఉండవచ్చు. రూ. 5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు, డెలివరీలు 2026 మార్చి చివరి నుండి మొదలవుతాయి.

ఈ కారు ప్రత్యేకతలు:
1.  ఈ కారు 4 సీట్లు ఇంకా 6 సీట్ల ఆప్షన్లలో వస్తుంది. ముఖ్యంగా వెనుక సీట్లు చాలా స్పెషల్. వీటిలో మసాజ్ ఫంక్షన్, హీటింగ్, వెంటిలేషన్ సౌకర్యాలు ఉన్నాయి. మీరు కాళ్లు చాపుకుని హాయిగా పడుకునేలా 'లెగ్ రెస్ట్' కూడా ఉంటుంది.

2. సినిమా థియేటర్ లాంటి అనుభవం కోసం ఇందులో 15 స్పీకర్లతో బర్‌మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంది.

3. మొదటిసారిగా ఈ కారు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వెర్షన్లలో వస్తుంది. V300 పెట్రోల్ ఇంజన్ మోడల్ స్మూత్ డ్రైవింగ్ కోసం మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుండగా.... V300d డీజిల్ ఇంజన్  లాంగ్ జర్నీలకు సెట్ అయ్యేలా మంచి పవర్‌ ఇస్తుంది. ఈ రెండు ఇంజన్లు 9G-TRONIC ఆటోమేటిక్ గేర్  ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి. 

►ALSO READ | ఇండియాలో iPhone 17e లాంచ్.. ప్రి-ఆర్డర్స్ చేసే ముందు ఇది తెలుసుకోండి !

4.  ఇండియాలోని గుంతల రోడ్లపై కూడా కారు అస్సలు కదలకుండా వెళ్లడానికి ఇందులో 'ఎయిర్ సస్పెన్షన్' ఇచ్చారు. దీనివల్ల ప్రయాణికులు గాలిలో తేలుతున్నట్లుగా చాలా కంఫర్ట్‌గా ఉంటారు.

ఇంతకుముందు ఈ కారును విదేశాల నుండి నేరుగా దిగుమతి చేసుకునేవారు (CBU), దానివల్ల ట్యాక్సులు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు  మన దేశంలోనే పూణేలోని ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తున్నారు. దీనివల్ల ధర కొంచెం తగ్గి, టయోటా వెల్‌ఫైర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.