
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్‌మెన్‌సాక్స్ హైదరాబాద్‌లోని తమ సంస్థ విస్తరణకు ఓకే చెప్పింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ డేవిడ్ ఎం.సోలమన్‌తో సమావేశమయ్యారు. గోల్డ్‌మెన్ సాక్స్ సంస్థలో ప్రస్తుతం వెయ్యి మంది పని చేస్తున్నారని, విస్తరణలో భాగంగా ఇంకో 2 వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని చైర్మన్ తెలిపారు. బ్యాంకింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో తమ సంస్థ కార్యకలాపాలు బలోపేతం చేయనున్నామని వెల్లడించారు. దీనికోసం హైదరాబాద్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో కొత్త ఆఫీస్ ప్రారంభిస్తామన్నారు.