India vs Nepal: అభిమానులకు గుడ్ న్యూస్.. శాంతించిన వరుణుడు

India vs Nepal: అభిమానులకు గుడ్ న్యూస్.. శాంతించిన వరుణుడు

ఆసియా కప్ లో భాగంగా టీమిండియా పాకిస్థాన్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దాయాదుల సమరం చూడాలనుకున్న అభిమానులందరికి వర్షం విలన్ గా మారింది. అయితే  ఈ మ్యాచులో టీమిండియా ఆటగాళ్లందరూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం కాస్త ఊరట కలిగించింది. కోహ్లీ, రోహిత్, అయ్యర్, గిల్ విఫలమైనా శ్రీలంక పిచ్ ల మీద ఇప్పటికే ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. మరోవైపు ఫామ్ లో ఉన్న కిషాన్ ఎంతో  పరిణితి చెందిన ఆట ఆడగా.. ఆల్ రౌండర్ పాండ్య టాప్ స్కోరర్ గా జట్టుని ఆదుకున్నాడు. ఇకపోతే బౌలర్లకు మాత్రం ప్రాక్టీస్ చేసే అవకాశం
ఇప్పటివరకు రాలేదు.

పల్లెకెలెలో ఎండ:
 
ఆసియా కప్‌ 2023లో భాగంగా మరి కాసేపట్లో (సోమవారం) శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయి క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-నేపాల్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. పాకిస్థాన్ మ్యాచ్ నిరుత్సాహ పరిచినా.. ఈ రోజు మ్యాచ్ మాత్రం జరిగేలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం పల్లెకెలెలో ఎండ కాస్తుంది. దీంతో ఈ  మ్యాచ్ చూడాలనుకున్న అభిమానులకి గుడ్ న్యూస్ అందినట్లయింది. ఇదిలా ఉండగా.. నిన్న కుండపోతగా వర్షం కురవడంతో ఈ మ్యాచ్ రద్దయ్యేలా కనిపించింది. ఈ రోజు ఉదయం కూడా వర్షం పలకరించడంతో అభిమానులు మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్నారు. పైగా ఈ రోజు మొత్తం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏ క్షణంలోనైనా వరుణుడు మ్యాచ్ కి అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
 
రద్దయితే సూపర్ -4కి భారత్:

గ్రూప్-ఏ లో భాగంగా ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ ఫోర్ కి చేరిన సంగతి తెలిసిందే. నేపాల్ మీద భారీ విజయం సొంతం చేసుకున్న పాక్, భారత్ పై మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. మరో వైపు నేపాల్, భారత్ మరో సూపర్ ఫోర్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకుంటారు . ఒకవేళ ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే రెండు పాయింట్లతో భారత్ సూపర్ ఫోర్ కి చేరుకుంటుంది. ఇప్పటికే పాక్ తో ఓడిపోయిన నేపాల్ కి భారత్ తో ఖచ్చితంగా గెలిస్తేనే సూపర్ ఫోర్ కి చేరుకుంటుంది. మరి వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తాడో..? లేకపోతే మ్యాచ్ జరుగుతుందో.. మరి కాసేపట్లో తెలిసిపోతుంది.