భారత్ కు గూగుల్ రూ.113 కోట్ల భారీ విరాళం

భారత్ కు గూగుల్ రూ.113 కోట్ల భారీ విరాళం

కరోనా సంక్షోభంలో గూగుల్ భారత్ కు రూ.113 కోట్ల భారీ సాయం ప్రకటించింది. ముఖ్యంగా 80 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచేందుకు, ఆరోగ్య సౌకర్యాల కోసం ఈ నిధులు ఉపయోగించనుంది. ఇందులో భాగంగానే గివ్ ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వనుంది. ఈ రెండు సంస్థలు దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే గివ్ ఇండియాకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకురూ.18.5 కోట్లు ఇవ్వనుంది. 15 రాష్ట్రాల్లో 1.80 లక్షల ఆశావర్కర్లకు, 40 వేల ఎన్ఎంలకు శిక్షణ కోసం ఆర్మన్ సంస్థకు రూ.3.6 కోట్లు ప్రకటించింది. అలాగే 20 వేల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల ప్రత్యేక శిక్షణ చేపడుతున్న అపోలో మెడ్ స్కిల్స్ కు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.