సోషల్ మీడియా యాప్స్ నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడితే వీడియో క్లారిటీ సరిగ్గా ఉండక ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ఆ ప్రాబ్లమ్ తీర్చడానికని గూగుల్, గూగుల్ డుయో యాప్ తీసుకువచ్చింది. కరోనా వల్ల ఆన్‌లైన్ క్లాస్‌లు, ఆన్‌లైన్ మీటింగ్స్ ఎక్కువయ్యాయని అందరూ ఒకే కాల్‌లో మాట్లాడుకోవడానికి వీలుండేలా గూగుల్ మీట్ యాప్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే యాప్‌గా తీసుకురాబోతోంది గూగుల్. ఆ యాప్‌కి కూడా గూగుల్ డుయో అనే పేరు పెట్టారు. ఇందులో వీడియో కాల్, ఆడియో కాల్‌తో పాటు, గూగుల్ మీట్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి.
