Google tool: ఈ గూగుల్ టూల్ క్లిక్ చేస్తే చాలు.. అలాంటి వార్తలు కనిపించవు

Google tool: ఈ గూగుల్ టూల్ క్లిక్ చేస్తే చాలు.. అలాంటి వార్తలు కనిపించవు

గూగుల్ ఇప్పుడు కొత్త టూల్ ను అందుబాటులోకి తెస్తోంది. తీవ్రవాదం, తప్పుడు సమాచారం, సెన్సార్ షిప్ లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఆల్టీట్యూడ్ అనే టూల్ ను గూగుల్ పరిచయం చేస్తోంది. దీనికి గూగుల్ విభాగం అయిన jigsaw  ద్వారా రూపొందించారు. టెక్ ఎగైనెస్ట్ టెర్రరిజం అని పిలువ బే సంస్థతో కలిసి ఈ టూల్ ను అభివృద్ధి చేశారు 

ఆల్టీట్యూడ్  టూల్ .. తీవ్రవాదం కంటెంట్ తప్పుడు సమాచారం, సెన్సార్ షిప్ లను ట్రాక్ చేస్తుంది. ఇది చిన్న ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లోలో తీవ్రవాద సంస్థలచే సృష్టించబడిన కాంటెంట్ ను సెంట్రల్ డేటా బేస్ కు యాక్సెస్ చేస్తుంది. ఐక్యరాజ్యసమితి  మద్దతు ఉన్న ఆన్ లైన్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్ టెక్ ఎగైనెస్ట్ టెర్రరిజం ద్వారా నిర్వహించబడుతున్న డేటా బేస్ ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. అల్టీట్యూడ్ టూల్ చిన్న ఫ్లాట్ ఫారమ్ లకు తమ నెట్ వర్క్ లలో ఉగ్రవాద కంటెంట్ ను సులభంగా, సమర్థవంతంగా గుర్తించి,తొలగించేందుకు తగిన సామర్థ్యాన్ని అందిస్తుంది. 

2017లో స్థాపించబడిన టెక్ ఎగైనెస్ట్ టెర్రరిజం .. గ్లోబల్ ఇంటెర్నెట్ ఫోరమ్ టు కౌంటర్ టెర్రరిజం తో కలిసి ఫేస్ బుక్ , మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యూట్యూబ్ ల ద్వారా కలిసి పనిచేస్తోంది.టెక్ ఎగైనెస్ట్ టెర్రరిజం .. మేసేజింగ్ యాప్ లు , వీడియో షేరింగ్ ప్లాట్ ఫారమ్ లు. సోషల్ మీడియా నెట్ వర్క్ లు ,ఫోరమ్ లతో సహా 100 కంటే ఎక్కువ ప్లాట్ ఫార్మ్ లతో ఇది పనిచేస్తుంది.