ఇంటర్నెట్ స్పీడ్‌లో ఆ దేశాలదే హవా.. జపాన్‌కు కూడా షాక్ ఇచ్చిన నంబర్ 1 కంట్రీ ఏదో తెలుసా?

 ఇంటర్నెట్ స్పీడ్‌లో ఆ దేశాలదే హవా.. జపాన్‌కు కూడా షాక్ ఇచ్చిన నంబర్ 1 కంట్రీ ఏదో తెలుసా?

మనం వెబ్‌సైట్స్ బ్రౌజ్ చేయాలన్నా, ఏదైనా సినిమాలు, వీడియోలు స్ట్రీమ్ చేయాలన్నా, ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, పెద్ద పెద్ద ఫైళ్లను డౌన్‌లోడ్ చేయాలన్నా.. వీటన్నిటికీ కావాల్సింది  హై-స్పీడ్ ఇంటర్నెట్. హై-స్పీడ్ ఇంటర్నెట్ అనేది కేవలం మన ప్రతిరోజు  కాలక్షేపానికే కాదు.. వ్యాపారాల వృద్ధికి, సరికొత్త డిజిటల్ ఆవిష్కరణలకు, ప్రపంచ సమాచారాన్ని  వేగంగా అందుకోవడానికి చాలా కీలకం.

మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఇంటర్నెట్ అత్యంత వేగంగా ఉందో తెలుసుకోవడం ఎలా ? దీనికోసం నిపుణులు 'ఓక్లా (Ookla) స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్' అండ్ 'స్టాటిస్టా' వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల సగటు వేగాన్ని లెక్కగడతాయి.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో 
స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం, 2025లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక్కడి మొబైల్ వినియోగదారులు ప్రపంచంలోనే అత్యధిక డౌన్‌లోడ్ స్పీడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

టాప్ ర్యాంకుల్లో ఉన్న మరికొన్ని దేశాలు

ఖతార్: ప్రపంచంలోనే రెండవ అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ ఇక్కడే ఉంది.

కువైట్: మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

బహ్రెయిన్, బ్రెజిల్, దక్షిణ కొరియా: ఇవి కూడా మొబైల్ స్పీడ్ టెస్టుల్లో టాప్ లో నిలిచాయి.

అయితే ఈ ర్యాంకింగ్‌లను నెట్‌వర్క్ వేగాన్ని కొలిచే అంతర్జాతీయ ప్రమాణమైన Mbps (మెగాబిట్స్ పర్ సెకండ్) ఆధారంగా లెక్కించారు.

ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో టాప్ దేశాలు
మనం ఇళ్లు, ఆఫీసుల్లో ఉపయోగించే ఫైబర్, కేబుల్ లేదా DSL వంటి వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను 'ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్' అంటారు. ఈ విభాగంలో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కలిగిన దేశంగా రికార్డు సృష్టించింది.

బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో టాప్ రేస్‌లో ఉన్న ఇతర దేశాలు చూస్తే:

ఫ్రాన్స్: ప్రపంచంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది.

యూఏఈ (UAE): మొబైల్‌లోనే కాదు, బ్రాడ్‌బ్యాండ్‌లోనూ ప్రపంచంలోనే టాప్-3 లో నిలిచింది.

►ALSO READ | రీల్స్ పిచ్చికి బ్రేక్.. యూకేలో అర్ధరాత్రి ఇంటర్నెట్ కర్ఫ్యూ.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

 అసలు కొన్ని దేశాల్లోనే ఇంటర్నెట్ ఎందుకు అంత వేగంగా ఉంటుందంటే 
ఒక దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి:

అధునాతన మౌలిక సదుపాయాలు: ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌ల వంటి బలమైన కనెక్షన్లు ఉండటం.

టెక్నాలజీలో పెట్టుబడులు: లేటెస్ట్ 5G లేదా 6G టెక్నాలజీపై భారీగా ఖర్చు చేయడం.

భౌగోళిక పరిస్థితులు: జనాభా,  ఆ దేశ విస్తీర్ణం కూడా నెట్‌వర్క్‌ను సులభంగా విస్తరించడానికి సహాయపడతాయి.

 జపాన్ టెక్నాలజీ అద్భుతమే.. కానీ  
ఇంటర్నెట్ అనగానే మనకు టెక్నాలజీ హబ్ అయిన జపాన్ గుర్తుకురావడం సహజం. ల్యాబ్‌లలో ప్రయోగాత్మకంగా సరికొత్త ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించి డేటా స్పీడ్‌లో జపాన్ రీసెర్చర్స్ సరికొత్త ప్రపంచ రికార్డులు సృష్టించిన మాట వాస్తవమే. కానీ, సాధారణ ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే సగటు ఇంటర్నెట్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం జపాన్ ప్రస్తుతం మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ రెండింటిలోనూ నంబర్ వన్ స్థానంలో లేదు. ఇక్కడ ఇంటర్నెట్ చాలా వేగంగా ఉన్న... గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మాత్రం సింగపూర్, యూఏఈల కంటే వెనుకబడి ఉంది.