యూకేలోని పిల్లలకు సోషల్ మీడియా కష్టాలు మొదలయ్యాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్రిటన్ ప్రభుత్వం త్వరలోనే పూర్తి 'నిషేధం' విధించబోతోంది. దీంతో పాటు 18 ఏళ్లలోపు టీనేజర్ల కోసం అర్ధరాత్రి కర్ఫ్యూలు, రీల్స్ షార్ట్స్ చూసేటప్పుడు 'ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్'కు బ్రేకులు వేసే అంశాలను కూడా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయాలపై టెక్నాలజీ కంపెనీలు ఎదురు తిరిగితే.. గట్టిగా బుద్ధి చెబుతామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరించారు.
ఈ నిషేధం పరిధిలోకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లలు వాడే ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి పాపులర్ యాప్స్ అన్నీ రాబోతున్నాయి. వీటితో పాటు ఆన్‌లైన్ గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా పిల్లలు అపరిచిత వ్యక్తులతో మాట్లాడటాన్ని కూడా బ్యాన్ చేయనున్నారు. నిజ జీవితంలో మీ పిల్లలను ఎవరైనా తెలియని పెద్దవారితో ఒంటరిగా వదిలేస్తారా? లేదు కదా.. మరి ఆన్‌లైన్ ప్రపంచంలో అలా ఎలా వదిలేస్తారు? అందుకే ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరికల్లా ఇందుకు సంబంధించిన రూల్స్ తీసుకొచ్చి.. వచ్చే ఏడాది స్పింగ్ నాటికి పూర్తిగా అమలు చేయాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.
►ALSO READ | మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన రంగంలో ఏకంగా 30% అప్
ఈ బ్యాన్‌తో పాటు టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్ కంపెనీలకు ప్రధాని స్టార్మర్ లండన్ టెక్ వీక్ వేదికగా ఒక అల్టిమేటమ్ జారీ చేశారు. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో పిల్లలు న్యూడ్ ఫోటోలు పంపకుండా, రిసీవ్ చేసుకోకుండా డివైజ్ కంట్రోల్స్ యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. ఇది పెద్ద అసాధ్యమైన పనేమీ కాదని.. ఒకవేళ టెక్ కంపెనీలు ఈ రూల్స్‌కు సహకరించకపోతే ఆయా కంపెనీల బాస్‌లు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. పెద్దలు మాత్రం ఏజ్ వెరిఫికేషన్ ద్వారా తమ కంటెంట్‌ను చూసుకోవచ్చని తెలిపారు. టోటల్‌గా చెప్పాలంటే.. నయా సోషల్ మీడియా బ్యాన్ రూల్ పిల్లలను మరింత సురక్షితంగా, సంతోషంగా ఉంచడమే కాకుండా వారి భవిష్యత్తుకు మరిన్ని అవకాశాలను ఇస్తుందని యూకే ప్రభుత్వం నమ్ముతోంది.
