గూగుల్ మ్యాప్స్ లో లైవ్ వ్యూ ఫీచర్

గూగుల్ మ్యాప్స్ లో లైవ్ వ్యూ ఫీచర్

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ మ్యాప్స్ లైవ్ వ్యూ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. దీనిద్వారా మ్యాప్స్ ని లైవ్ ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. మ్యాపింగ్ కూడా సులువుగా ఉంటుంది.

లైవ్ వ్యూ ఎలాపనిచేస్తుందంటే.. ముందు మ్యాప్స్ కి కెమెరా యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు కెమెరా ద్వారా మ్యాప్స్ లో సెర్చ్ చేసిన లొకేషన్ లైవ్ లో చూపిస్తుంది. సమీపంలోని రెస్టారెంట్ లు, కేఫ్ లు, బిల్డింగ్స్, ఏటీఎం అన్నీ లైవ్ లో కనిపిస్తాయి. వాటి టైమింగ్స్, రేటింగ్, రివ్యూలన్నీ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ ఫీచర్ ని నవంబర్ చివరికల్లా అందుబాటులోకి తెస్తామంటుంది గూగుల్. ఈ ఫీచర్ ఇప్పటికే లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో సిటీల్లో అందుబాటులో ఉంది.