మొదటి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించిన గూగుల్‌

మొదటి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించిన గూగుల్‌

టెక్ దిగ్గజం గూగుల్ మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హార్డ్‌వేర్ ప్రోడక్ట్స్‌తో ఈ స్టోర్‌ను లాంచ్ చేసింది. చెల్సీ ప్రాంతంలో ఈ స్టోర్ ను ఏర్పాటు చేసింది. గూగుల్ తయారు చేసిన అన్ని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. పిక్సెల్ ఫోన్లు, స్టేడియా, వేర్ఓఎస్‌, ఫిట్‌బిట్ డివైజ్‌లు, పిక్సెస్‌బుక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ స్టోర్ కు సంబంధించి ఇవాళ(శుక్రవారం) ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

ప్రపంచంలో LEED ప్లాటినం రేటింగ్‌లు ఉన్న 215 స్టోర్లలో తమది కూడా ఒకటని.. తమ గూగుల్ స్టోర్‌ను సందర్శించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ పిచాయి ట్వీట్‌ చేశారు. ఐఫోన్‌ల రిపేర్ కోసం ఆపిల్ స్టోర్లకు వెళ్లినట్లే పిక్సెల్ ఫోన్ల రిపేర్ కోసం ఈ గూగుల్ స్టోర్లకు వెళ్లవచ్చు.