దక్షిణాసియా రాక్‌‌‌‌‌‌‌‌బాల్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌ కు మేడ్చల్ యువకుడు

దక్షిణాసియా రాక్‌‌‌‌‌‌‌‌బాల్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌ కు మేడ్చల్ యువకుడు

మేడ్చల్, వెలుగు: నేపాల్ రాజధాని ఖాట్మండులో జూన్ 27 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక తొలి దక్షిణాసియా రాక్‌‌‌‌‌‌‌‌బాల్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు భారత జట్టులో మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన గోపాల్ యాదవ్ ఎంపికయ్యారు. 

ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన రాక్‌‌‌‌‌‌‌‌బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ ఆధారంగా జాతీయ సెలెక్టర్లు ఆయనను ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేశారు. 

ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువస్తానని చెప్పారు.