మాగంటి సునీత గోపీనాథ్ భార్య కాదు..ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు

మాగంటి సునీత గోపీనాథ్ భార్య కాదు..ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సతీమణి కాదని, ఆమె లీవ్ ఇన్ రిలేషన్ లో ఉండే వారని గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆమె నామినేషను డిస్ క్వాలిఫై చేయాలని కోరారు.

 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లోని సెక్షన్ 125 ఏ ప్రకారం ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. తన తల్లి కోసరాజు మాలిని దేవిని 1998 ఏప్రిల్ 29న గోపీనాథ్ చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారని తెలిపారు. ఆమెకు గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని అన్నారు. సునీత లీవ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని, తాను చట్టబద్ధమైన భార్యగా, పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా అఫిడవిట్ లో పేర్కొన్నారని ఆరోపించారు. సునీత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను కూడా మోసపూరితంగా పొందారని, 11 అక్టోబర్ 2025 న దానిని రాజేంద్రనగర్ ఆర్డీవో విచారణ చేసి రద్దు చేశారని అన్నారు. అఫిడవిట్. అభ్యర్థిత్వం మోసపూరితమైనదిగా తేలితే నామినే షన్ రద్దు చేయాలని కోరారు.

వివరాలన్నీ సరైనవే: సునీత

తాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలన్నీ సరైనవేనని మాగంటి సునీత ఎన్నికల అధికారులకు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆమె బీఆర్ఎస్ లీగల్ టీంతో కలిసి ఎన్నికల రి టర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ మేరకు పలు పత్రాలను ఇవ్వడంతోపాటు తాను ఇచ్చిన పత్రాలన్నీ సరైనవే నని పేర్కొంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు.

►ALSO READ | డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారానికి చెక్!..కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం