డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ( అక్టోబర్ 22) కీలక ప్రతిపాదన చేసింది. కేంద్రం చేసిన ప్రతిపాదన ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించే కంటెంట్ ను స్పష్టంగా లేబుల్ చేయాలి. అసలు కంటెంట్ ఏదీ, ఆర్టిఫిషియల్ కంటెంట్ ఏదీ అనేది ఈజీగా గుర్తిం అవకాశం ఉంది. డిజిటల్ భద్రత, క్వాలిటీ సమాచారం అందించే దిశగా ఇది కీలక ముందడుగు.
ప్రతిపాదన ప్రకారం.. టెక్ కంపెనీలు తమ కంటెంట్ మోడరేషన్ విధానాలను మార్పు చేయాల్సి ఉంటుంది. AI తో రూపొందించే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కంటెంట్ ను తప్పసరిగా లేబుల్ చేయాలి. ఇది బాధ్యతాయుతమైన AI వినియోగానికి ఓ మార్గం.
AIవినియోగం.. పెరుగుతున్న ఆందోళన
AI దుర్వినియోగంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది.తప్పుడు సమాచారం యూజర్లకు హాని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. AI తో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోలపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. బాలివుడ్ స్టార్స్అభిషేక్ బచన్, ఐశ్చర్యారాయ్ బచన్తమ వీడియోలను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలను తయారు చేశారని అభ్యంతరకరంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇది ytube AI శిక్షణ విధానాన్ని సవాల్ చేశారు.
AI వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. గతేడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మూడు రెట్లు పెరిగిందని స్వయంగా Open AI సీఈవో ఆల్ట్ మన్ చెప్పడం ఏఐ వినియోగం ఏ తీరులో ఉందో తెలుస్తోంది.
