
అక్రమంగా కబేళాకు తరలిస్తున్న 13 ఆవులను గోసేవకులు కాపాడారు. ఆదివారం మధ్యాహ్నాం నల్గొండ జిల్లా మల్లెపల్లి నుండి చిన్న వాహనంలో గోవులను కబేళాలకు తరలిస్తుండగా రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో గోసేవకులు వ్యాన్ లో ఉన్న వ్యక్తులను అడ్డుకున్నారు. వారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు అప్పగించి, గోవులను రక్షించారు. నిబంధనలకు విరుద్దంగా కబేళాలకు ఆవులను తరలించడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి, గోవులను గోశాలకు తరలించారు. గోవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోరక్షకులు కోరుతున్నారు.