మోదీ సభను టీవీలో చూడటం బాధగా ఉంది:రాజాసింగ్

మోదీ సభను టీవీలో చూడటం బాధగా ఉంది:రాజాసింగ్

ప్రధాని నరేంద్ర మోదీ సభను టీవీలో చూడటం బాధగా ఉందన్నారు  గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్.  నవంబర్ 7న  ఎల్బీ స్టేడియంలో జరిగిన  మోదీ సభకు  రాజాసింగ్ హజారుకాలేదు. సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం  గోషామహల్ నియోజకవర్గంలో ఉంది. అయితే  రాజాసింగ్ ఇప్పటికే నామినేషన్ వేశారు.  ఆ సభలో పాల్గొంటే సభ ఖర్చంతా తన అకౌంట్ లో  రాసే అవకాశముందని.. తాను అందుకే  సభకు  హాజరు కాలేదన్నారు రాజాసింగ్.  ఇదే విషయాన్ని తాను  తన  పార్టీ నేతలు.. కేంద్ర ఎన్నికల కమిషన్ తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. కిషన్ రెడ్డి కూడా దీనికి అంగీకరించినందును తాను సభకు హాజరు కాలేదన్నారు. 

 ఎల్బీ స్టేడియంలో మోదీ సభను కార్యకర్తలతో కలిసి తాను కూడా టీవీలో చూశానని చెప్పారు రాజాసింగ్.తమ గురువు  మోదీ పాల్గొన్న సభలో తాను లేకపోవడం  ..టీవీలో  చూడటం నిజంగా బాధగా ఉందన్నారు రాజాసింగ్. 

 హైదారాబాద్ లోని గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి  నందకిషోర్ వ్యాస్ పోటీ చేస్తున్నారు.