కాంగ్రెస్ ను గెలిపిస్తే దేశంలో రక్షణ ఉండదు : రాజాసింగ్

కాంగ్రెస్ ను గెలిపిస్తే దేశంలో రక్షణ ఉండదు : రాజాసింగ్
  • గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ను గెలిపిస్తే.. దేశంలో రక్షణ ఉండదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి పటాన్​చెరు టౌన్ లో బీజేపీ ర్యాలీ, కార్నర్​మీటింగ్ నిర్వహించగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావుతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల మోదీ పాలనలో బాంబు పేలుళ్లకు తావు లేకుండా చేశామని

శత్రుదేశాలు  పేలుళ్లకు ఆలోచిస్తే సర్జికల్​స్ట్రైక్ తో భయం పుట్టించామని పేర్కొన్నారు. రఘునందన్​ రావును గెలిపించి లోక్ సభకు పంపితే మెదక్​ జిల్లా గళం దేశమంతటా వినిపిస్తుందని తెలిపారు.  ప్రజలు మోస పూరిత మాటలు నమ్మకుండా దేశానికి, ధర్మానికి కట్టుబడి ఉండే పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు.  ఈ ఎన్నికలు పదవుల కోసం కాదని, దేశ ప్రధానికి, దేశ రక్షణను నిర్దేశించే ఎన్నికలని అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.