ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుంది

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుంది

యాసంగిలో పండిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధాన్యం సేకరణపై  ప్రణాళికలు, కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ధాన్యం కొనుగోళ్లపై ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) పెడుతున్న కండీషన్లను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల్లో వరి వేసుకోవాలని..నీరు అందుబాటులో లేని దగ్గర చిరు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయవద్దంటోందని  అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని..ఇది సరైంది కాదన్నారు.

బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. రైతు బిడ్డ అయిన కేసీఆర్ కు రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసన్నారు. తెలంగాణకు మీరు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. FCI ద్వారా కొంటామని కేంద్రం నుండి ఒక లేఖ తీసుకువస్తే రైతుల తరపున బండి సంజయ్ కాళ్ళు మొక్కుతామన్నారు.

కలెక్టర్లు కూడా రైతుల మేలు కోరే సలహాలు ఇస్తున్నారని అన్నారు ఎర్రబెల్లి, పల్లా.. ఎంత నష్టం జరిగినా ధాన్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ వానాకాలం పంటలు కూడా కొంటామని తెలిపారు.