ఆర్టీసీలో కొలువుల జాతర.. 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్

ఆర్టీసీలో కొలువుల జాతర.. 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రెండు, మూడు రోజుల్లో  నోటిఫికేషన్
  • ఇప్పటికే డ్రైవర్, శ్రామిక్, సూపర్ వైజర్ తదితర 3 వేల  పోస్టుల భర్తీ ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్, సూపర్ వైజర్ తదితర మొత్తం 3 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా 1,500  కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

రెండు, మూడు రోజుల్లో  నోటిఫికేషన్ వెలువడనుంది. సాధారణంగా ఆర్టీసీలో పోస్టులు భర్తీ ప్రక్రియను పోలీస్​రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డుకు అప్పగించడం ఆనవాయితీ. తాజా కండక్టర్ పోస్టుల భర్తీని మాత్రం ఆర్టీసీ యాజమాన్యానికే  అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 4, 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్లు తప్ప ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలోనే ఏకంగా 4,500 పోస్టులను భర్తీ చేయడం ఆర్టీసీపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇది ఆర్టీసీ భవిష్యత్​పై ఆశలకు సంకేతమని స్పష్టం చేస్తున్నారు.