ఓయూ అధికారులపై ప్రభుత్వం సీరియస్

ఓయూ అధికారులపై ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు రీ ఓపెన్ అని ప్రకటిస్తే.. మీరేంటి ఆన్ లైన్ క్లాసులని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా మండిపడడంతో.. ఓయూ అధికారులు వెంటనే సర్దుకున్నారు. ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని, విద్యార్థులందరూ కళాశాలల్లో తరగతులకు హాజరు కావాలని ప్రకటించారు. 
కాగా క్లాసుల నిర్వహణపై ఉదయం ప్రిన్సిపల్స్, యూనివర్సిటీ ఉన్నతాధికారులంతా సమావేశమై కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుండడంతో ఫిబ్రవరి 12 వరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. టీచింగ్.. నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కాలేజీలకు హాజరై.. ఆన్ లైన్ క్లాసులు సజావుగా జరిగేలా చూడాలని నిర్దేశించారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఓయూలో ఫిబ్రవరి 12 వరకు ఆన్ లైన్ క్లాసులే నంటూ ప్రసార మాధ్యమాల్లో.. వెబ్ సైట్లలో వార్తలు రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఓయూ అధికారులు వెంటనే మాట మార్చి.. ఆన్ లైన్ క్లాసుల బదులు ఆఫ్ లైన్ క్లాసులే నిర్వహిస్తున్నామని..  ఉదయం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు 5,879

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు