AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

 AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును అంగీకరించిన గవర్నర్.. ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆదేశాలు జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు గా ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులతో చర్చించిన సందర్భంగా 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అటు తర్వాత మంత్రి వర్గ సమావేశంలో చర్చించి  తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం ప్రతిపాదనపై గవర్నర్ ఆమోద ముద్ర వేసి ఆర్దినెన్స్ జారీ చేశారు. ఇవాళే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ఇది రెండోసారి. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రిటైర్మెంట్ వయసును 58 నుండి 60 ఏళ్లకు పెంచుతూ.. 2014లో జూన్ 2వ తేదీ నుండి అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు జగన్ సర్కార్ కూడా అదే బాటలో 60 ఏళ్ల రిటైర్మెంట్ ను 62 ఏళ్లకు  పెంచింది. తాజా ఉత్తర్వుల ద్వారా ఈనెలలో రిటైర్ అయిన వారితోపాటు జనవరి 31న ఇవాళ రిటైర్ కావాల్సిన వారు కూడా మరో రెండేళ్ల పాటు ఉద్యోగాల్లో కొనసాగే అవకాశం ఏర్పడింది.

 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విచారణ స్పీడప్