అంగన్ వాడీల వేతనాలు పెంపు

అంగన్ వాడీల వేతనాలు పెంపు

అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాన్ని పెంచుతూ ఇవాళ(బుధవారం) తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 30 శాతం PRC పెంచిన  క్రమంలో  వీరికి కూడా వేతన పెంపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలతో అంగన్వాడీ టీచర్ల వేతనం గతంలో రూ.10,500 వేతనం ఉండగా.. దానిని రూ.13,650కి పెంచారు. మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.6వేలు  నుంచి రూ.7,800 లకు పెరగనుంది. అంగన్‌వాడీ ఆయాలకు రూ.6వేలు వేతనం ఉండగా వాళ్లకు కూడా రూ.7,800 వేతనం పెంచారు.

పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు  ప్రభుత్వం తెలిపింది.