హైదరాబాద్, వెలుగు: మొక్కజొన్న పంట కొనుగోళ్లకు సర్కారు సిద్ధమైంది. లక్ష టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి నాఫెడ్ అంగీకరించింది. అదనంగా వచ్చిన మక్కలను కొనడానికి రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్లు మార్క్ఫెడ్చైర్మన్ మార గంగారెడ్డి వెల్లడించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 5.46క్షల ఎకరాల్లో సాగైందన్నారు. 9.63లక్షల టన్నుల మక్కలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2225 కాగా, మార్కెట్లో సగటున రూ. 2172 ధరలు ఉన్నాయనీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మక్కల కొనుగోలు సెంటర్లలో నాఫెడ్ తరపున కొంటామని వెల్లడించారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలతో సహా 12 కేంద్రాలను శనివారం నుంచే ప్రారంభించామని మార్క్‌ఫెడ్ చైర్మన్గంగారెడ్డి, ఎండీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.