ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది... రైతులకు అండగా ఉంటాం... ఆందోళన పడొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది... రైతులకు అండగా ఉంటాం... ఆందోళన పడొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరు క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గురువారం ( మే 7 ) జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆందోళన పడొద్దని అన్నారు.ధాన్యం కొనుగోళ్లు హామీలీలు లేక ఆలస్యం జరుగుతుందని.. ఇప్పటికే కలెక్టర్ కు హమాలీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించానని.. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు. 

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని.. రైతులందరికీ గోదాములలో ధాన్యం వేసుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు మంత్రి వివేక్. మన రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని..ప్రతిపక్ష నేతలు కావలనే ఏదో విధానంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ధర్నాలు చేస్తున్నారని అన్నారు మంత్రి వివేక్.

చెన్నూరులో 12 మిల్లులో మిల్లింగ్ కి ఇవ్వడం జరిగిందని.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హామీలీలు ఎండలో పని చేయలేకపోతున్నారని అన్నారు. కానీ.. చెన్నూరులో  రోజుకు సుమారు 100 లారీలు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు మంత్రి వివేక్. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని..రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి వివేక్. 

చెన్నూరు నియోజకవర్గంలో కాటన్ కొనుగోళ్లు ఇక్కడ 15 రోజులు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగిందని..ఎంపీ వంశీకృష్ణ కేంద్రం నుండి కాటన్ కొనుగోళ్ళ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారని అన్నారు. 

చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల బాధితులతో అనేక మార్లు చర్చలు జరిపానని...చెన్నూరు మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చడానికే అనేక సార్లు చర్చలు జరిపామని అన్నారు మంత్రి వివేక్.

రోడ్డు విస్తరణ కోసం 60 ఫీట్ల విస్తరణ చేయాలని అధికారులు చెప్పారని.. వ్యాపారస్తులు మా దగ్గరికి వచ్చి 55 ఫీట్లు చేయాలని కోరారని అన్నారు. ఎవరు కూడా రోడ్డు విస్తరణలో నష్టపోకుండా వారికి టీడీఆర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా రోడ్డు విస్తరణ పనులు చేశారని.. వారికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. కానీ మేము ఇక్కడ షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా షాపులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 

ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణను 55 ఫీట్లకు చేయడం జరిగిందని అన్నారు మంత్రి వివేక్. వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకి వచి వారు ఖాళీ చేస్తామనున్నారని...మున్సిపాలిటీలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాప్స్ పోయిన వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి వివేక్. చెన్నూరు మున్సిపాలిటీలో జాగాలో  షాపులు కోల్పోయిన వారిని ఆదుకుంటామని..ప్రజలెవరూ అసత్య పుకార్లు నమ్మవద్దని అన్నారు.

కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ నాయకుడని..అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని..గత ప్రభుత్వంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. తాను వచ్చాక రెండు సార్లు నష్టపరిహారం అందించానని.. గత ఎమ్మెల్యే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టించి ఇవ్వలేదని అన్నారు.