ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్డీవోల నియామకంపై వెనక్కి

ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్డీవోల నియామకంపై వెనక్కి
  • డాక్టర్ల ఆందోళనతో తగ్గిన సర్కారు‌‌
  • అలాంటిదేమీ లేదని లీకులిస్తున్న హెచ్‌‌ఓడీలు
  • ఎన్నికల నేపథ్యంలోనే నిర్ణయం!

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయంపై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. శాసన మండలిలో మంత్రి హరీశ్‌‌  రావు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటి నుంచి ప్రభుత్వ డాక్టర్ల సంఘాలన్నీ ఏకమై సర్కారు నిర్ణయాన్ని తప్పబడుతున్నాయి. డీహెచ్  శ్రీనివాసరావు, మెడికల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్  రమేశ్‌‌  రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌‌‌‌ను డాక్టర్లు కలిసి తమ డిమాండ్ల నోట్‌‌ను వారికి అందజేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యలన్నింటినీ ఆ నోట్‌‌లో పేర్కొన్నారు. బుధవారం హెల్త్ సెక్రటరీని కలిసి, ఆర్డీవోలను ఇన్ చార్జీలుగా నియమించే అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. సర్కారు‌‌కు 15 రోజుల డెడ్‌‌లైన్‌‌  పెట్టారు. ఈలోపు  ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వైద్య గర్జన పేరిట వ్యతిరేకంగా సభ నిర్వహిస్తామని డాక్టర్లు ఇదివరకే హెచ్చరించారు. 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుమారు 50 వేల మంది ఉద్యోగులు కలిగిన హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఇలాంటి పరిణామాలు మంచిది కాదని హెచ్‌‌ఓడీలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. దీంతో ఆర్డీవోల నియామక అంశంపై ప్రభుత్వ పెద్దలు డైలమాలో పడ్డారు. ఇప్పుడు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తే పరువు పోతుందని, ప్రకటించకపోతే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ గిరిజన విభాగం డిమాండ్​ చేసింది. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్వీ గిరిజన విద్యార్థులు బీజేపీ స్టేట్ ఆఫీస్​ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోయం బాపూరావును ఎంపీ పదవి నుంచి తొలగించాలని, బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్  చేశారు. గిరిజనుల హక్కులను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాలరాస్తున్నదని ఫైరయ్యారు.ములుగులో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్లతో ఇబ్బంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా డాక్టర్లను బుజ్జగించే పనిని హెచ్‌‌ఓడీలకు సర్కారు అప్పజెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్డీవోల నియామకం ఉండబోదు అని హెచ్‌‌ఓడీలు తమను కలిసిన డాక్టర్లకు చెబుతున్నారు.

నిర్లక్ష్యంగా సూపరింటెండెంట్లు

ప్రభుత్వ దవాఖాన్లలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న కొంత మంది సీనియర్  డాక్టర్లు సైతం ప్రైవేటుగా ప్రాక్టీస్  చేస్తున్నారు. తాము బాస్‌‌గా ఉన్న ప్రభుత్వ దవాఖానాకు సమీపంలోనో, మరో సిటీలోనో ప్రైవేటు హాస్పిటల్‌‌  నడిపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాకు ఉదయం, సాయంత్రం వెళ్లి ఒక రౌండ్ వేసి తమ ప్రైవేటు ప్రాక్టీస్‌‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది టైమ్‌‌కు వస్తున్నారో లేదో పర్యవేక్షించాల్సిన వ్యక్తులే తప్పు చేస్తుండడంతో, మిగిలిన వారు కూడా డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ ఉండాల్సిన డాక్టర్లు.. మధ్యాహ్నం ఒంటి గంటకే హాస్పిటల్  నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌‌  రావు జగిత్యాల దవాఖానా విజిటింగ్‌‌కు వెళ్తే, 13 మంది డాక్టర్లు ఉండాల్సిన దవాఖానలో ఇద్దరే అందుబాటులో ఉన్నారు. సూపరింటెండెంట్‌‌  కూడా అటెండెన్స్‌‌ వేసుకుని నిజామాబాద్‌‌కు వెళ్లిపోయాడు. దీంతో ఖంగుతిన్న మంత్రి.. మిగిలిన హాస్పిటల్స్‌‌లో పరిస్థితి ఎలా ఉందో  ఇంటర్నల్‌‌గా ఇంటెలిజెన్స్‌‌ వాళ్లతో రిపోర్ట్‌‌లు తెప్పించుకున్నారు. చాలా హాస్పిటల్స్‌‌లో ఇదే తరహా నిర్లక్ష్య వ్యవస్థ ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఆర్డీఓలను అడ్మినిస్ట్రేటివ్‌‌  ఆఫీసర్లుగా నియమించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రెండేండ్ల కిందటే ఈ ఆలోచన చేసిన సర్కారు.. డాక్టర్లలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని భావించి ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా వాయిదా వేసింది. ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో అనవసర తలనొప్పులు ఎందుకని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.