హుస్నాబాద్, వెలుగు: విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన గవర్నమెంట్ టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్న ఉప్పుల వేణుగోపాల్ అదే స్కూల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం స్కూల్‌కు వెళ్లి సదరు టీచర్‌పై దాడి చేశారు. టీచర్‌పై పోక్సో కేసు నమోదవగా, హెచ్ఎం మహేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు
