- గవర్నమెంట్ టీచర్‌కు మూడు నెలల జైలు
గజ్వేల్, వెలుగు : అప్పు తీసుకుని తిరిగి చెల్లించడానికి ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడంతో ఓ గవర్నమెంట్టీచర్కు గజ్వేల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అడ్వకేట్ పార్థసారధిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన రామయ్య వద్ద మజీద్‌పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు రూ.2.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
అనంతరం చెక్కు ద్వారా చెల్లింపులు జరిపాడు. రామయ్య చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. పదే పదే చెక్ బౌన్స్ కావడంతో2018లో రామయ్య గజ్వేల్ ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి కోర్టులో కేసు వేశాడు. దీనిపై బాధితుడి తరపున వాదనలు వినిపించగా బుధవారం జడ్జి సౌమ్య మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని తెలిపాడు.