V6 News

పబ్లిసిటీ కోసమే సీఎంకు హరీశ్ రావు లేఖ : ప్రభుత్వ విప్ వేముల

పబ్లిసిటీ కోసమే సీఎంకు హరీశ్ రావు లేఖ : ప్రభుత్వ విప్ వేముల
  • వరి వేస్తే ఉరేనన్న మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా?: ప్రభుత్వ విప్ వేముల

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే హరీశ్ రావు పబ్లిసిటీ కోసమే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆరోపించారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే హరీశ్ అసత్యాలతో సీఎంకు లేఖ రాశారన్నారు.

వరి వేస్తే ఉరేనన్న మీకు.. రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. అన్నదాతలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనలా నీచ రాజకీయాలు ఈ దేశంలో మరొకరు చేయరని ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేయడం హరీశ్ కు అలవాటేనని దుయ్యబట్టారు.