
హైదరాబాద్, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నెల 5వ తేదీన ట్యాంక్ బండ్ దగ్గర సాగర్పార్క్లో జయంతి కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
ఉదయం 10 గంటల నుంచి ప్రోగ్రామ్ మొదలు కానుంది. కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగా జయంతి కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.