- బిడ్లు సమర్పించిన జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీలు
- ఈ వారంలోనే ఎంపిక
- వచ్చే వారంలో పనులు అప్పగించే అవకాశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ - 2047 రూపకల్పనకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. మాస్టర్ప్లాన్రూపకల్పనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) అధికారులు కన్సల్టెంట్స్ను ఆహ్వానించగా ఆరు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో మెయిన్హార్డ్సింగపూర్ప్రైవేట్లిమిటెడ్, సర్బానా జరోంగ్ (సింగపూర్), లీ అసోసియేట్స్, ఈ కోమ్, సీబీఆర్ఈ, ఇంటర్నేషనల్కన్సల్టెంట్స్వంటి కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్స్‌ను మరికొద్ది రోజుల్లో ఓపెన్చేయనున్నట్టు తెలిసింది. రెండో వారంలో ఎంపికైన సంస్థకు పనులు అప్పగించనున్నారు.
వరల్డ్ క్లాస్ సిటీగా..
765 చ. కి.మీ పరిధిలోని గ్రామాలతో వరల్డ్ క్లాస్ సిటీగా ఫ్యూచర్‌సిటీని నిర్మించాలని అధికారులు ప్లాన్లు రూపొందించారు. ఇప్పుడున్న నగరానికి మించి పలు ప్రత్యేకతలతో ప్రపంచ స్థాయి నగరంగా రూపొందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టేలా యాక్షన్ప్లాన్రెడీ చేశారు.
ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, తమ యాక్టివిటీస్ఇక్కడి నుంచి నిర్వహించాలన్నా అన్ని రకాల మౌలిక సదుపాయలు అవసరం. అందుకు తగ్గట్టుగా ఫ్యూచర్‌సిటీని రూపుదిద్దేందుకు సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎఫ్సీడీఏ జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి మాస్టర్ ప్లాన్ కోసం రూపకల్పనకు టెండర్లనుఆహ్వానించింది.
