గవర్నర్‌‌‌‌‌‌‌‌తో అడ్వకేట్ జనరల్ భేటీ .. పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌పై వివరణ

గవర్నర్‌‌‌‌‌‌‌‌తో అడ్వకేట్ జనరల్ భేటీ .. పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌పై వివరణ

హైదరాబాద్, వెలుగు: గవర్నర్​జిష్టుదేవ్​వర్మతో అడ్వకేట్​జనరల్ సుదర్శన్​రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్​చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్​ముసాయిదాపై గవర్నర్ లీగల్​ఒపీనియన్​ కోరగా.. దానిపై ఆయనకు​ఏజీ వివరించినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్​ 285(ఏ)లో రిజర్వేషన్ల సంఖ్యను ప్రస్తావించకుండా మార్పు చేయడంపై గవర్నర్ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం. 

ప్రస్తుతం ఉన్న చట్టంలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ఉన్నదని, రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తారని, ఇది లీగల్‌‌‌‌గా ఇబ్బందులు తీసుకురాదు కదా? అని గవర్నర్ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదనిఏజీ చెప్పినట్టు తెలిసింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో పంచాయతీరాజ్​చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌కు గవర్నర్​ ఆమోదముద్ర వేస్తారని ప్రభుత్వం భావిస్తున్నది.