
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ సీపీ రాధకృష్ణన్నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత అసెంబ్లీ, మండలిని స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. వచ్చే నెలలోనే వర్షాకాల బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.