
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నివాళులు అర్పించారు. మంగళవారం రాజ్ భవన్ లో జయశంకర్ ఫొటోకు పూలదండ వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటులో ఆయన పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ కొనియాడారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.