గవర్నర్, సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

గవర్నర్, సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. 9 రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని ప్రార్థించారు.