నిజాం నుంచి విముక్తి పొందిన విధానం గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు . ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు కొనసాగనుంది.. ఎవరో అడ్డుకుంటారని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకుండా ఉండొద్దన్నారు.
