రేపు బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళిసై

రేపు బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళిసై

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు బాసర వెళ్లనున్నారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడనున్నారు. రైలు మార్గాన వెళ్లనున్న గవర్నర్ తెల్లవారుజామున 2:50గంటలకు బాసర రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4 గంటలకల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. 6.15గంటల వరకు ట్రిపుల్ ఐటీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్న అనంతరం  శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్ ఐటీకి చేరుకోనున్న గవర్నర్ తమిళిసై విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ఉదయం 8గంటల నుంచి 10 వరకు అక్కడ విద్యార్థులతో సమావేశం అవుతారు. 10గంటలకు ట్రిపుల్ ఐటీ నుంచి బయలుదేరి నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి రోడ్డు మార్గంలో చేరుకుంటారు . వర్సిటీ విద్యార్థులు, సిబ్బందితో గవర్నర్ ముచ్చటించనున్నారు. లంచ్ అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి  రైలు మార్గంలో సాయంత్రం 5.40గంటలకు హైదరాబాద్ రానున్నారు.