అదానీ కొత్త సంస్థ.. ఏఈ5ఎల్.. ఈ కంపెనీ టార్గెట్ ఏంటంటే..

అదానీ కొత్త సంస్థ.. ఏఈ5ఎల్.. ఈ కంపెనీ టార్గెట్ ఏంటంటే..

న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అదానీ ఎకోజెన్ ఫైవ్ లిమిటెడ్ (ఏఈ 5ఎల్) పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటో తేదీన ఈ సంస్థను రిజిస్టర్ చేసింది. 

సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఎలెవన్ లిమిటెడ్ కు ఇది పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా ఉంటుంది.

అహ్మదాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద ఏఈ 5ఎల్ నమోదైంది. ఈ సంస్థ ఇంకా తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించలేదు. ఏఈ5ఎల్ సంస్థకు రూ. లక్ష పెయిడ్ షేర్ క్యాపిటల్ ఉంది.